నిబంధనాలకు విరుద్ధంగా డీజే లు ఏర్పాటు చేయవద్దు

SRCL: నిబంధనలకు విరుద్ధంగా డీజేలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి. గీతే అన్నారు. ముస్తాబాద్ లోని పోలీస్ స్టేషన్‌ను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కేసుల దర్యాప్తు విషయంలో ఎలాంటి అలసత్వం వహించద్దని సూచించారు. ఫిర్యాదుల పట్ల తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.