జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి

SKLM: కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను ఆదుకునే దిశగా పలు కార్యక్రమాలను చేపడుతుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. సోమవారం నరసన్నపేటలో ఒక ప్రకటన విడుదల చేస్తూ ఈనెల 9న నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళాను చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. పదవ తరగతి నుండి డిగ్రీ, పీజీ, డిప్లమో చదువుకున్న నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.