VIDEO: మద్ది సన్నిధిలో ఆకట్టుకున్న కోలాటం
ELR: జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలో వేంచేసియున్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ఆదివారం సెలవు రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో కామవరపుకోట మండలం K.S. రామవరం గ్రామానికి చెందిన హరే శ్రీనివాస కోలాట బృందం కోలాట నృత్య ప్రదర్శన నిర్వహించారు.