మండల వనరుల కేంద్రాన్ని తనిఖీ చేసిన అడిషనల్ డైరెక్టర్

మండల వనరుల కేంద్రాన్ని తనిఖీ చేసిన అడిషనల్ డైరెక్టర్

SRD: కొండాపూర్ మండల వనరుల కేంద్రాన్ని స్టేట్ అడిషనల్ డైరెక్టర్ రమణ మూర్తి సోమవారం తనిఖీ చేశారు. కార్యాలయంలో ఉన్న రికార్డులను, ఆన్‌లైన్‌లో నమోదైన విద్యార్థులు వివరాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న ఆన్‌లైన్ పనులన్నీ ఎప్పటికప్పుడు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆయన వెంట సీఎంవో వెంకటేశం, ఎంఈవో దశరథ్‌లు ఉన్నారు.