జాతీయ ప్రజాప్రతినిధుల సదస్సుకు ఎంపికైన సర్పంచ్
W.G: ఉండి మండలం మహాదేవపట్నం గ్రామ సర్పంచ్ వనిమా నాగ వెంకటసుబ్బలక్ష్మి ఢిల్లీలో ఈ నెల 11వ తేదీన జరిగే మహిళా ప్రజాప్రతినిధుల జాతీయ సదస్సుకు సోమవారం బయలు దేరి వెళ్తున్నట్టు ఆమె తెలిపారు. గత ఏడాది కూడా తాను పాల్గొన్నట్టు గుర్తు చేశారు. రెండో సారి పాల్గొనే అవకాశం లభించినందుకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నానన్నారు. కాగా, ఈ సదస్సుకు రాష్ట్రం నుంచి ఏడుగురు ఎంపికైన విషయం తెలిసిందే.