'సంక్రాంతి పండుగ సంప్రదాయ పద్ధతిలో జరుపుకోవాలి'
PPM: రానున్న సంక్రాంతి పండుగ సంప్రదాయ పద్ధతిలో కుటుంబంతో ఆనందంగా జరుపుకోవాలని ఎస్పీ మాధవరెడ్డి ఆకాంక్షించారు. సంక్రాంతి పండగ పేరుతో గ్రామాల్లో కోడిపందేలు, పేకాట, గుల్లాట చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడితే కఠిన చర్యలు తీసుకొంటామని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. గ్రామాల్లో ప్రత్యేక నిఘా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారని ఎస్పీ తెలిపారు.