SC యువతకు హెవీ వాహన డ్రైవింగ్ శిక్షణ

SKLM: జిల్లాకు చెందిన షెడ్యుల్డ్ కులాల యువతీ, యువకులకు భారీ వాహన డ్రైవింగ్ శిక్షణ కల్పించనున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాకు చెందిన 10 మంది అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. అభ్యర్థుల వయస్సు 20-40 ఏళ్లతో పాటుగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలన్నారు.