'కుష్టు వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలి'
PPM: కుష్టు వ్యాధి నిర్మూలనకు విశేష కృషి చేయాలని, అపోహలు వదిలి చికిత్స పొందాలని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర్ రెడ్డి తెలిపారు. శనివారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ఈ నెల 17 నుంచి కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించే కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.