స్కావెంజర్ కాలనీ సమస్యలపై నేతల పర్యటన
తిరుపతి నగరంలోని స్కావెంజర్ కాలనీలో రాష్ట్ర మంత్రి నారాయణ, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి,ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు సంయుక్తంగా నిన్న రాత్రి పర్యటించి స్థానిక సమస్యలను పరిశీలించారు. తాగునీటి కొరత, కాలువల దుస్థితి, రోడ్ల సమస్యలు, పారిశుద్ధ్య లోపాలపై కాలనీ వాసుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు.