VIDEO: తడ్కల్‌లో అగ్నిప్రమాదం.. ఇల్లు దగ్ధం
SRD: ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి ఇల్లు దగ్ధమైన ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. కంగ్టి మండలం తడ్కల్ గ్రామానికి చెందిన మొగులవ్వ భర్త రాజు ఇంట్లో ఆదివారం షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇల్లు దగ్ధమైంది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కుటుంబ సభ్యులు వేడుకున్నారు. తమ బతుకు రోడ్డుపై పడిందని వాపోయారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.