VIDEO: అయినవిల్లి విఘ్నేశ్వరుని ఆలయానికి పోటెత్తిన భక్తులు

VIDEO: అయినవిల్లి విఘ్నేశ్వరుని ఆలయానికి పోటెత్తిన భక్తులు

కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామివారి ఆలయానికి మార్గశిర మాసం శుద్ధ విజయ శనివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. అక్షరాభ్యాసాలు, అన్న ప్రాసనల వద్ద కూడా రద్దీ ఎక్కువగానే ఉంది. వాహన పూజలు కూడా విశేషంగా జరిగాయని అర్చకులు తెలిపారు.