మోదీ-మైథిలీపై అసభ్యకర ఏఐ వీడియో.. బీజేపీ మండిపాటు
ప్రధాని మోదీ, సింగర్, బీహార్ ఎమ్మెల్యే మైథిలీకి సంబంధించిన AI వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియోను అసభ్యకరంగా రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై బీజేపీ మండిపడింది. ఈ AI వీడియోను క్రియేట్ చేసిన వారి వెంటనే అరెస్ట్ చేసి కఠిన శిక్ష వేయాలని డిమాండ్ చేసింది. అలాగే ఆ వీడియోను తొలగించాలని కోరింది.