VIDEO: వయోభారాన్ని దాటిన ఓటు ఉత్సాహం
HNK: రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో వృద్ధులు ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించారు. ఆదివారం ఐనవోలు మండలం పున్నేలు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పోలింగ్ కేంద్రంలో 96 ఏళ్ల తీగల భద్రమ్మ, 92ఏళ్ల పాపయ్యతో పాటు పలువురు వృద్ధులు ఇతరుల సహాయంతో పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారు.