ఈతకోటలో ఘనంగా చిరంజీవి పుట్టినరోజు వేడుకలు

కోనసీమ: రావులపాలెం మండల పరిధిలోని ఈతకోట గ్రామంలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలను శుక్రవారం ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని పలు ఆలయాల్లో చిరంజీవి గోత్ర నామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి మెగాస్టార్ ఫొటోకి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. సినీ రంగంలో చిరంజీవి స్వయంకృషితో ఎదిగారని కొనియాడారు.