VIDEO: కుళ్లిపోయిన చికెన్ నిలువలను గుర్తించిన అధికారులు
HYD: సికింద్రాబాద్ వారాసిగూడ పీఎస్ పరిధిలో చికెన్ సెంటర్ పై పోలీసులు దాడులు నిర్వహించారు. కుళ్లిపోయిన చికెన్ నిలువలను జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు గుర్తించారు. చికెన్ నిలువ ఉంచడానికి వీలు లేదని తెలిపారు. చట్టపరమైన కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ దాడుల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు.