చెన్నారావు పేటలో కోతుల బీభత్సం

చెన్నారావు పేటలో కోతుల బీభత్సం

WGL: చెన్నారావు పేట మండలం పాత ముగ్దూంపురం గ్రామంలో కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయి. గుంపులుగా తిరుగుతూ.. ఇళ్లలోకి చొరబడి వస్తువులు తీసుకెళ్లడంతో పాటు పిల్లలు, వృద్ధులపై దాడులు చేస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. పంటలను సైతం నాశనం చేస్తున్నాయని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకుని కోతుల బారి నుంచి విముక్తి కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.