VIDEO: 'కిడ్నీల కోసం నా కొడుకుని హత్య చేశారు'
అన్నమయ్య: మదనపల్లి మండలం అరవవాండ్లపల్లికి చెందిన పూల దివాకర్ హత్య కేసులో అతని తల్లి లక్ష్మీదేవి సోమవారం SPకి ఫిర్యాదు చేశారు. గణేష్ అనే వ్యక్తి మరికొందరితో కలిసి తన కొడుకును కిడ్నీల కోసం చంపి, కాళ్లు,తల వేరు చేసి పేగులను చెట్టుకు వేలాడదీశారని ఆమె ఆరోపించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులతో కలిసి మదనపల్లి డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.