VIDEO: ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే

BDK: బూర్గంపాడు మండలం గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో పినపాక MLA పాయం వెంకటేశ్వర్లు గురువారం సాయంత్రం పర్యటించారు. లోతట్టు ప్రాంత వాసులతో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అండగా ఉంటుందని, అప్రమత్తంగా లోతట్టు ప్రాంత వాసులు ఉండాలని సూచన చేశారు. అధికారులు అందుబాటులో ఉంటారని, సమస్య ఏదైనా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.