ఐటీ ఉద్యోగులతో సమావేశమైన ఎమ్మెల్యే తాటిపర్తి

ప్రకాశం: ఎర్రగొండపాలెం, త్రిపురాంతకం మండలాలకి చెందిన ఐటీ ఉద్యోగులతో శనివారం హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్‌లో ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను విస్తృతంగా ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలి, నియోజకవర్గం అభివృద్ధికి ఏ విధంగా భాగస్వాములు కావాలనే అంశాలపై ఐటీ ఉద్యోగులతో ఎమ్మెల్యే చర్చించారు.