నర్సరీ పనులను ప్రారంభించిన సర్పంచ్
MHBD: తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామంలో నర్సరీ పనులను సర్పంచ్ ముద్ధం సునీత వీరారెడ్డి ఇవాళ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. నర్సరీలో పండ్లు, పూల మొక్కలను పెంచి రైతులకు అందించడం జరుగుతుందని అన్నారు. మొక్కలు పెంచడం ద్వారా వర్షాలు బాగా కురువడమే కాకుండా ఆక్సీజన్ శాతం పెరుగుతుందని తెలిపారు.