VIDEO: 'ఆసుపత్రులలో ధరల పట్టిక ఏర్పాటు చేయాలి'

KKD: జిల్లా వ్యాప్తంగా ఉన్న నర్సింగ్ హోమ్‌లు, క్లినిక్‌ల్లో ధరల పట్టిక ఏర్పాటు చేయాలని లేకుంటే కఠిన చర్యలు తప్పవని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జె. నరసింహ నాయక్ హెచ్చరించారు. శుక్రవారం ఆయన కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి ఆసుపత్రిలోనూ ఫీజులు వివరాలు బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి అని సూచించారు.