ఈ నెల 14 న అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ క్రీడాకారుల ఎంపిక

ఈ నెల 14 న అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ క్రీడాకారుల ఎంపిక

SKLM: కోడి రామ్మూర్తి స్టేడియంలో ఈ నెల 14 న ఉ.9 గం.కు అంతర జిల్లా అథ్లెటిక్ ఛాంపియన్‌ షిప్‌ కోసం ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కె. మధుసూదనరావు, సాంబమూర్తి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. అండర్ 14, 16, 18, 20 విభాగాల్లో ఎంపికలు జరుగుతాయన్నారు. క్రీడాకారులు తమ ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలన్నారు.