హోలీ పండగను శాంతియుతంగా జరుపుకోవాలి: సీపీ
KNR: జిల్లాలో హోలీ పండగను ప్రజలు శాంతియుతంగా, సోదరభావంతో జరుపుకోవాలని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం సూచించారు. బలవంతంగా రంగులు పూసినా, మద్యం సేవించి వాహనాలు నడిపినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళల భద్రత కోసం షీ-టీమ్స్ నిఘా ఉంటుందనీ, ఉల్లంఘన చేస్తే వాహనాలు సీజ్ చేస్తామని, అత్యవసరమైతే ‘డయల్ 100’కు కాల్ చేయాలని తెలిపారు.