'వార్డు సభ్యులు అవగాహన పెంచుకోవాలి'
MNCL: పంచాయతీరాజ్ చట్టంపై వార్డు సభ్యులు అవగాహన పెంచుకోవాలని జన్నారం ఎంపీడీవో ఉమర్ షరీఫ్ అన్నారు. జన్నారంలోని రైతు వేదికలో మండలంలోని వార్డు సభ్యులకు నిర్వహిస్తున్న మూడో విడత శిక్షణ బుధవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ చట్టం, అభివృద్ధి ప్రణాళిక, తదితర అంశాలను వార్డు సభ్యులకు అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పాల్గొన్నారు.