రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే సామేలు

SRPT: రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే సామేలు అన్నారు. బుధవారం నూతనకల్ మండలం తాళ్లసింగారంలో నిర్మించనున్న చెక్ డ్యామ్ పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఈ ప్రాంతంలోని రైతాంగానికి సాగునీరు అందించడమే లక్ష్యంగా చెక్ డ్యాం నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకన్న యాదవ్, తీగల గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు.