వినాయక చవితి పండుగకు పోలీస్ యంత్రాంగం సహకరించాలని వినతి

WGL: వినాయక చవితి పండుగకు పోలీసు యంత్రాంగం పూర్తిగా సహకరించాలని వరంగల్ బీజేపీ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ కోరారు. ఈ మేరకు శనివారం వరంగల్ ఏసీపీని ఆయన మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రంను సమర్పించారు. వినాయక మండపాలను ఏర్పాటు చేసే భక్తమండలి సభ్యులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం కోసం పూర్తి సహాయ సహకారాలను అందించాలని కోరారు.