కొండగట్టు అంజన్నను దర్శించుకున్న మాజీ స్పీకర్
JGL: కొండగట్టు ఆంజనేయస్వామిని తెలంగాణ శాసన మండలి ప్రతిపక్ష నాయకులు, మాజీ స్పీకర్ మధుసూదనాచారి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు సిబ్బంది స్వాగతం పలికగా మధుసూదనాచారి ఆంజనేయస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం అందించారు. అనంతరం ఈవో శేష వస్త్రం కప్పి ప్రసాదం అందజేశారు.