జిల్లాలో కుండపోత వర్షం

MHBD: జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల వర్షం కురుస్తుంది. మహబూబాబాద్, ఈదుల పూసపల్లి, నెల్లికుదురు, నరసింహులపేట సహా అనేక ప్రాంతాల్లో వరదనీరు రోడ్ల పై ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఇంట్లో నుంచి బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. రా.7 వరకు చిన్న గూడూరు 16.7 మిల్లీమీటర్లు, నరసింహుల పేటలో 11.6 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసిందని వాతావరణ శాఖ తెలిపింది.