చేపల లోడుతో వెళ్తున్న వ్యాన్ బోల్తా

చేపల లోడుతో వెళ్తున్న వ్యాన్ బోల్తా

VSP: జాతీయ రహదారిపై పీఎం పాలెం కారుషెడ్డు కూడలి వద్ద సోమ‌వారం ఓ మినీ వ్యాన్ బోల్తా పడింది. శ్రీకాకుళం నుంచి విమానాశ్రయానికి చేపల లోడుతో వెళ్తున్న ఈ వ్యాన్, రెడ్ సిగ్నల్ పడటంతో ఒక్కసారిగా అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో వ్యాన్ డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ట్రాఫిక్ సీఐ ఎన్.సాయి కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు ప్రారంభించారు.