శ్రీరామసాగర్‌కు పెరిగిన వరద

JGL: శ్రీరామసాగర్ ప్రాజెక్టులోకి శుక్రవారం సాయంత్రం వరకు 34,097 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువకు నీటి విడుదలను 5వేల క్యూసెక్కులకు పెంచారు. ఇతర కాలువలు, ఎత్తిపోతలు, మిషన్ భగీరథ పథకాలకు కలిపి మొత్తం ఔట్‌ఫ్లో 6,413 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టులో నీటి నిల్వ 47. 250 టీఎంసీలకు, నీటి మట్టం 1080.80 అడుగులకు చేరింది.