జిల్లాలో పెరుగుతున్న చలి తీవ్రత
MDK: ఈ ఏడాది శీతాకాలం కాస్త ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ, ఇప్పుడు ఒక్కసారిగా తీవ్రరూపం దాల్చనుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈనెల 11 నుంచి 19 వరకు తీవ్రమైన చలి వాతావరణం నెలకొంటుందని, 13 నుంచి 17 మధ్యలో చలి గరిష్ట స్థాయికి చేరుకుంటుందని అంచనా వేశారు. సింగిల్ డిజిట్‌కు పడిపోయే అవకాశం ఉంది. రాబోయే 8 నుంచి 10 రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ చలి హెచ్చరిక జారీ చేసింది.