VIDEO: హైవేపై టాయిలెట్లకు తాళం ప్రయాణికుల అవస్థలు

VIDEO: హైవేపై టాయిలెట్లకు తాళం ప్రయాణికుల అవస్థలు

NLG: చిట్యాల మండలం వెలిమినేడు వద్ద జాతీయ రహదారిపై ఉన్న ట్రక్ లే-బే (ట్రక్కులు నిలుపు స్థలం)లో టాయిలెట్లకు తాళాలు వేసి ఉండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కారులో ప్రయాణించే మహిళలు, డ్రైవర్లు కాలకృత్యాల కోసం బహిరంగ ప్రదేశాలను ఆశ్రయించాల్సి వస్తోంది. వినియోగంలోని టాయిలెట్లకు తాళంవేసి ఉండటం ఏమిటి అనేది పలువురులో ప్రశ్నగా మిగిలింది.