'ఐక్యమత్యంగా ఉంటూ దేశభక్తిని చాటాలి'

RR: మన్సురాబాద్ డివిజన్‌లో వివిధ కాలనీల్లో, ప్రధాన కూడళ్లలో స్వతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజలకు స్వేచ్ఛ విలువ, ఐక్యత ప్రాముఖ్యత, యువతలో దేశభక్తి పట్ల అవగాహన పెంపొందించారు. ప్రతి ఒక్కరూ ఐక్యమత్యంగా ఉంటూ దేశభక్తిని చాటాలన్నారు.