ఏటూరునాగారంలో తగ్గుతున్న గోదావరి

MLG: జిల్లా ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద మంగళవారం గోదావరి నీటిమట్టం తగ్గడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద తగ్గుముఖం పట్టడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం పుష్కర ఘాట్ వద్ద గోదావరి నీటిమట్టం 14.36 మీటర్లుగా ఉందని అధికారులు తెలిపారు.