సీపీ రాధాకృష్ణన్‌ను కలిసిన సుదర్శన్ రెడ్డి

ఉపరాష్ట్రపతిగా గెలుపొందిన సీపీ రాధాకృష్ణన్‌ను ప్రత్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాధాకష్ణన్‌కు అభినందనలు తెలిపారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక ఫలితాల అనంతరం వీరి భేటి ప్రత్యేకత సంతరించుకుంది. కాగా, ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్ల తేడాతో NDA అభ్యర్థి రాధాకృష్ణన్ విజయం సాధించిన విషయం తెలిసిందే.