ఉమ్మడి పాలమూరులో ఎన్నికల సందడి

ఉమ్మడి పాలమూరులో ఎన్నికల సందడి

MBNR: రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 23న ఓటర్ల ముసాయిదా జాబితా సిద్ధం చేయాలని ఆదేశించడంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎన్నికల వేడి మొదలైంది. దీంతో గ్రామాల్లో రాజకీయ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. క్షేత్రస్థాయి పరిస్థితులు, సామాజిక సమీకరణాల ఆధారంగా అభ్యర్థుల ఎంపికపై ప్రధాన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి.