జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న ఎండల తీవ్రత
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. బుధవారం మధ్యాహ్నం గరిష్ఠంగా 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వేడిగాలుల ధాటికి ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. మధ్యాహ్నం వేళ రోడ్లన్నీ నిర్జనంగా మారుతున్నాయి. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.