మోడల్ ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం

SRPT: నడిగూడెం MPDO కార్యాలయంలో నిర్మించిన మోడల్ ఇందిరమ్మ ఇల్లును సోమవారం కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.