VIDEO: పందులకు నిలయంగా మండల ఆఫీస్
VZM: బొబ్బిలి ఎంపీడీవో కార్యాలయం పందులకు నిలయంగా మారింది. నివాస ప్రాంతాల్లో పందులు పెంపకం చేయకూడదని నిబంధన ఉన్నప్పటికీ మున్సిపల్ అధికారులు ఉదాసీనతతో పందులు పెంపకందారులు విచ్చలవిడిగా పట్టణంలో పెంచుతున్నారు. దీంతో MPDO, RWS, పంచాయతీరాజ్, హౌసింగ్, ఐకెపీ, వ్యవసాయశాఖ, విద్యాశాఖ కార్యాలయాలు, పరిసరాల చుట్టూ పందులు తిరుగుతూ పరిసరాలను నాశనం చేస్తున్నాయి.