పుంగనూరులో సాఫీగా జరిగిన కౌన్సిల్ సమావేశం
CTR: పుంగనూరు పట్టణంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఛైర్మన్ అలీమ్ బాషా అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ సమావేశం సోమవారం సాఫీగా జరిగింది. ఇందులో భాగంగా అజెండాలోని 6 అంశాలను కౌన్సిలర్‌లు ఏకగ్రీవంగా ఆమోదించారు. తర్వాత పట్టణంలో నెలకొన్న సమస్యలపై చర్చించారు. 7వ వార్డు అంబచిన్నబవీధిలో నెలకొన్న కాల్వ సమస్యను పరిష్కరించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.