కొవ్వొత్తులతో గ్రామస్తుల నిరసన

కొవ్వొత్తులతో గ్రామస్తుల నిరసన

ATP: రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్టు (ఆర్టీటీ)కి విదేశాల నుంచి నిధులు రాకుండా కేంద్రం అడ్డుకోవడంపై కుందుర్పి మండలం కృష్ణాపురంలో శుక్రవారం రాత్రి గ్రామస్తులు కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మార్పీఎస్ తాలూకా అధ్యక్షుడు బాబు ఆధ్వర్యంలో గ్రామస్తులు అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. సేవ్ ఆర్డీటీ అంటూ నినాదాలు చేశారు.