INDw vs SAw: నిలకడగా ఆడుతున్న సౌతాఫ్రికా
ప్రపంచకప్ ఫైనల్‌లో 298 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు నిలకడగా ఆడుతోంది. 10 ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 52 పరుగులు చేసింది. ఓపెనర్ టాజ్మిన్ బ్రిట్స్‌ను అమన్‌జోత్ కౌర్ రనౌట్ చేయగా, మరో ఓపెనర్ లారా వోల్వార్ట్ 32 పరుగులతో బ్యాటింగ్ చేస్తోంది. ప్రస్తుతం ఆమెకు తోడుగా అన్కె బోష్ (0) ఉంది.