'భక్తి మార్గంతోనే మానసిక ప్రశాంతత కలుగుతుంది'
ADB: భక్తి మార్గంతోనే మనిషి ప్రవర్తనతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని బోథ్ MLA అనిల్ జాదవ్ పేర్కొన్నారు. మండల కేంద్రానికి చెందిన అయ్యప్ప స్వాములు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ను నేరడిగొండలోని ఆయన నివాసంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి మంచి మార్గంలో పయనించాలని కోరారు.