రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలి: ఎర్రబెల్లి

రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలి: ఎర్రబెల్లి

MHBD: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ కార్యకర్తలు, నాయకులకు పిలుపునిచ్చారు. పెద్దవంగర మండలంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయం కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైంది.