గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్, రిమాండ్

గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్, రిమాండ్

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిషేధిత గంజాయిని అక్రమంగా కలిగి ఉన్న ఇద్దరు యువకులు కంట శివ, ఉర్సు దిలీప్ కుమార్ లను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 1 కిలో 650 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని, NDPS చట్టం ప్రకారం కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు పట్టణ సీఐ నరేష్ కుమార్ తెలిపారు.