నేడు జిల్లాకు సెంట్రల్ ప్రభారీ అధికారి
ASF: ఆకాంక్షిత జిల్లాల జాబితాలో ఉన్న కుమురం భీం జిల్లాలో నీతి అయోగ్ కార్యక్రమంలో భాగంగా సంపూర్ణత అభియాన్ లక్ష్యానికి అనుగుణంగా సాగుతోంది. ఈ కార్యక్రమంలో అమలవుతున్న పనులను పరిశీలించి సమీక్షించడానికి డిల్లీ నుంచి సెంట్రల్ ప్రభారీ అధికారి, సీనియర్ IAS అధికారి రజత్ సైనీ సోమవారం జిల్లా పర్యటనకు రానున్నట్లు కలెక్టర్ కె.హరిత ఓ ప్రకటనలో తెలిపారు.