వడ్డీ వ్యాపారులపై పోలీసుల దాడులు

నిజామాబాద్: పట్టణంతోపాటు జిల్లా వ్యాప్తంగా 70 చోట్ల అక్రమ వడ్డీ వ్యాపారుల ఇండ్లలో, ఆఫీసుల్లో పోలీసులు దాడులు నిర్వహించి నగదు, విలువైన డాక్యుమెంట్లను, బంగారం స్వాధీనం చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 70 చోట్ల పోలీసుల దాడులు చేసి 23 కేసులు నమోదు చేసి రూ.ఆరకోటి నగదు, 157 గ్రాముల బంగారం, విలువైన డాక్యుమెంట్లు స్వాదీనం చేసుకున్నారు. కాలి చెక్కులను సైతం స్వాధీనం చేసుకున్నారు.