'జిల్లాలో కోర్టు విధులను బహిష్కరిస్తున్నాం'

'జిల్లాలో కోర్టు విధులను బహిష్కరిస్తున్నాం'

న్యాయవాది పవన్ కుమార్‌పై దాడి చేసిన సీఐ విక్రమ్ సింహాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం డిమాండ్ చేసింది. ఈనెల 25 నుంచి 27 వరకు కోర్టు విధులను బహిష్కరిస్తున్నట్లు సంఘం ప్రతినిధులు హరినాథ్ చౌదరి, వెంకటేశ్వర్లు ప్రకటించారు. జిల్లా బార్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన అత్యవసర సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు.