సైనికులకు అండగా ఉండాలి: కేపీ వివేకానంద

సైనికులకు అండగా ఉండాలి: కేపీ వివేకానంద

TG: సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే కేపీ వివేకానంద మండిపడ్డారు. దేశవ్యాప్తంగా సంఘీభావ ర్యాలీలు జరుగుతుంటే రేవంత్ రెడ్డి ఏమో తెలంగాణలో క్యాట్ వాక్ చేపిస్తున్నారంటూ విమర్శించారు. జవాన్లకు మనం మనోధైర్యం ఇవ్వాలని, సైనికులకు అండగా ఉండాలని సూచించారు. ప్రత్యక్షంగా మనం పాల్గొనకపోవచ్చు కానీ, ఎలాంటి అవసరం వచ్చినా మేం సిద్ధంగా ఉన్నామని చెప్పే అవసరం ఉందన్నారు.