VIDEO: రైతు వేదికలో మౌలిక వసతులు కరువు
SRD: కంగ్టి మండలం తడ్కల్ రైతు వేదిక నిర్వహణకు ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మారిన తర్వాత ఒక్క రూపాయి కూడా నిధులు రాకపోవడంతో కనీసం ఫ్యాన్లు కూడా పని చేయడం లేదని, దీనివల్ల సమావేశాలకు వచ్చే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే నిర్వహణ నిధులు మంజూరు చేయాలని కోరుతున్నారు.